పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు

Bhumana Karunakar Reddy: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మీ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయి. సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయి. వందల ఏళ్ల దూరం ప్రయాణించి పులస చేపల్ని కూడా గోదావరిలో ఉండేటట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నాం ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణం మీ అధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో చల్లదనం శాశ్వతంగా ఉంచాలని కోరుతున్నామని భూమన అన్నారు.
అయితే, సనాతన ధర్మ పరి పరిరక్షకులుగా మీరు ఇంకా ఎన్నో చేయాలి అని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. దేవాలయాల్లో, రోడ్లపై ప్రమాదాలు జరగకుండా మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలన్నారు. మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని కూడా మీ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకోవడం అభినందనీయం అంటు వ్యంగ్రాస్త్రలు సంధించారు. ప్రకృతిని శాసించే శక్తి మీకు కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ, ప్రజలకు అర్థం అయ్యింది అని కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.



