ఆంధ్ర ప్రదేశ్
Bhuma Akhila Priya: ఫుట్‌బాల్, వాలీబాల్‌కు తేడా తెలియని వాళ్లు మంత్రిగా చేశారు

Bhuma Akhila Priya: ఆడుదాం-ఆంధ్రా ప్రోగ్రామ్‌పై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. 400కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు భూమా అఖిల ప్రియ. ఫుట్‌బాల్, వాలీబాల్‌కు తేడా తెలియని వాళ్లు మంత్రిగా చేశారంటూ భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. మంత్రులు ఆడారే తప్ప ఆటగాళ్లను ప్రోత్సహించలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
రోజా, సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో స్కామ్ జరిగిందంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక ఈ స్కామ్ వెనక తాడేపల్లి ఆఫీస్ కూడా ఉందని ఆదిరెడ్డి వాసు సంచలన ఆరోపణలు చేశారు. పేద క్రీడాకారులతో గత జగన్ ప్రభుత్వం ఆడుకుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ సీఐడీ విచారణ జరుగుతోందని ప్రకటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.