తెలంగాణ
ఉప్పల్ ట్రాఫిక్ ఫోలీస్ స్టేషన్ లో భోగి సెలబ్రేషన్స్
హైదరాబాద్.. ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు అంతా కలిసి భోగి మంటలు వేసి పండుగ జరపుకున్నారు. పోలీస్ స్టేషనే తమ ఇళ్లు అని.. అందుకే తాము పోలీస్ స్టేషన్ లో పండుగ జరుపుకున్నామన్నారు ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి. ప్రజలందరి కష్టాలు భోగి మంటల్లో కాళిపోయి.. సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారామె. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి.. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ట్రాఫిక్ సీఐ.