Bhavana Ramanna: పెళ్లి కాకుండానే గర్భవతి అయిన 40 ఏళ్ల నటి!

Bhavana Ramanna: కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న తల్లి కాబోతున్నారు. 40 ఏళ్ల వయసులో పెళ్లి కాకుండానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. IVF ద్వారా కవలలకు జన్మనివ్వనున్న ఆమె, సోషల్ మీడియాలో ఈ సంతోషాన్ని పంచుకున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, భరతనాట్య నిపుణురాలు భావన రామన్న తన జీవితంలో కొత్త పయనం మొదలుపెట్టారు. 40 ఏళ్ల వయసులో, వివాహం కాకుండానే తల్లి కావాలని నిర్ణయించిన ఆమె, IVF చికిత్స ద్వారా కవలలకు గర్భం దాల్చారు. 1996లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన భావన, నటనతో పాటు నృత్యంలోనూ రాష్ట్ర అవార్డులు సాధించారు.
మొదట్లో వైద్యుల నుంచి అనుమతి లభించనప్పటికీ, ఒక వైద్యుడి సహకారంతో తొలి ప్రయత్నంలోనే గర్భవతి అయ్యారు. ప్రస్తుతం ఏడో నెలలో ఉన్న ఆమె, త్వరలో కవలలకు జన్మనిస్తారు. సోషల్ మీడియాలో ఆమె ఈ ఆనందాన్ని పంచుకుంటూ, “నా పిల్లలకు తండ్రి లేకపోయినా, ప్రేమతో నిండిన కుటుంబంలో పెరుగుతారు” అని భావోద్వేగంగా తెలిపారు.