తెలంగాణ
అంబేడ్కర్ విగ్రహానికి భట్టి విక్రమార్క ఘన నివాళులు

Bhatti Vikramarka: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు దేశానికే మార్గదర్శకం అన్నారు. అత్యంత బలమైన, అద్భుతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని భట్టి కొనియాడారు.



