తెలంగాణ
Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని.. ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాద ఘటనలో ఎస్‌ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.