తెలంగాణ
Chiranjeevi: మన హైదరాబాద్‌కు విలువైన మొక్కలను తీసుకువచ్చారు

Chiranjeevi: విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారని, కానీ రాందేవ్ రావు ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును ఏర్పాటు చేశారని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. హైదరాబాద్‌కు విలువైన మొక్కలను తీసుకువచ్చారన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 150 ఎకరాల్లో రాందేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఎక్స్‌పీరియం పార్కు హైదరాబాద్‌కు తలమానికం అవుతుందని, ఒక కళాఖండంగా మిగిలిపోతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదేశం అందరి కన్నా ముందు తనకే తెలుసన్నారు చిరంజీవి.