గ్లామర్ ట్రీట్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి.. టీజర్ వైరల్!

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ విడుదలైంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్ & గ్లామర్ కంటెంట్‌తో వస్తోంది. రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఎంతగానో ఆకర్షించారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ ఆద్యంతం నవ్వులతో నిండి ఉంది. సంక్రాంతి పండుగను ముందుగానే తెచ్చినట్టు కట్ చేసిన ఈ టీజర్‌లో రవితేజ కామెడీ టైమింగ్ హైలైట్‌గా నిలిచింది. వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్ కామెడీతో నవ్వులు పంచనున్నారు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా గ్లామర్ డోస్ పెంచేశారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. టీజర్‌తోనే ఆడియెన్స్‌ను బాగా మెప్పించారు మేకర్స్.



