Bhairavam: మెగా అభిమానులకు ‘భైరవం’ దర్శకుడు క్షమాపణలు!

Bhairavam: నాంది ఫేమ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించిన ‘భైరవం’ సినిమాపై మెగా అభిమానులు బాయ్‌కాట్ ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? దర్శకుడు ఎలా స్పందించారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లపై సోషల్ మీడియాలో మార్ఫ్ ట్రోల్స్ షేర్ చేశారన్న ఆరోపణలతో మెగా అభిమానులు #BoycottBhairavam ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన విజయ్, తన అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ పోస్టులు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. మెగా హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లు తనకు ప్రోత్సాహం అందించారని, తాను కూడా మెగా అభిమానినేనని పేర్కొన్నారు. అభిమానులకు క్షమాపణలు చెప్పిన విజయ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.