ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలంలో ఎలుగుబంటి హల్‌చల్

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. దోర్నాల రహదారిలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎలుగుబంటి రోడ్డుపై తిరుగడంతో శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయంగా మారింది. బస్సులో వెళ్తున్న భక్తులకు రోడ్డుపై ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన నెలకొంది.
ఎలుగుబంటి నెమ్మదిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు ఊపరి పీల్చుకున్నారు. ప్రయాణికులు ఎలుగుబంటిని తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్య మృగాలు తిరిగి ప్రాంతాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం, అటవీ శాఖ అధికారులు సూచించారు.