తెలంగాణ

దిల్‌సుఖ్‌నగర్‌లో బీసీ బంద్‌.. ప్రైవేట్‌బస్సులను అడ్డుకున్న బీసీ సంఘాలు

హైదరాబాద్‌‌ దిల్‌సుఖ్‌నగర్‌లో బీసీ బంద్‌ నడుస్తోంది. ఉదయం నుంచే బీసీ సంఘాల నేతలు రోడ్డెక్కారు. దిల్ సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట, రోడ్లపైనా బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, కులసంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రైవేటు బస్సులను అడ్డుకున్న బీసీ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీసీ సంఘాల నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button