సినిమా

బండ్లన్న మళ్ళీ రెచ్చిపోయాడు?

Bandla Ganesh: టాలీవుడ్‌లో మరోసారి వివాదం రేపిన బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం పొగడ్తలతో పాటు ఓ యంగ్ హీరోను టార్గెట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క హిట్‌తో అహంకారం చూపే వారిని రోస్ట్ చేశారు బండ్ల గణేష్.

నాలుగు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. మధ్యలో పొలిటిక్స్‌లోనూ పాల్గొన్నారు. ఆయన స్పీచ్‌లకు అభిమానులు ఉంటారు. పొలిటికల్ ఈవెంట్ అయినా, సినిమా ఫంక్షన్ అయినా సంచలనం సృష్టిస్తారు. తాజాగా KRAMP సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఒక్క హిట్‌తో లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, క్యాప్, రాత్రుళ్లు అద్దాలు పెట్టుకొని, వాట్సాప్ వాట్సాప్ అనే వారిపై విమర్శలు గుప్పించారు. కిరణ్‌ను చూస్తే చిరంజీవి గుర్తొస్తారని చెప్పారు. ఒక్క హిట్‌తో రాజమౌళి, లోకేష్, అనిల్ రావిపూడిని తీసుకురండి అనే హీరోలు ఉన్న రోజుల్లో కిరణ్ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఓ యంగ్ హీరోను ఉద్దేశించినవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button