తెలంగాణ

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు బండి సంజయ్‌

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తూ, ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనితో ఆయన గురువారం హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ భేటీలో తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిపినట్లు సమాచారం.

గత​ప్రభుత్వ హయాంలో బండి సంజయ్​ ఫోన్ల నే​అత్యధికంగా ట్యాప్ ​చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్​ట్యాపింగ్‌లో సిట్​ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కావడం గమనార్హం.

మరో వైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్​సంతోష్​ఫోన్‌ను సైతం ట్యాప్​చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది.

ఫోన్​ ట్యాపింగ్​కేసులో గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటు​సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్ సిట్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరుకానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్​ప్రభుత్వం ట్యాపింగ్​చేసిందని గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button