తెలంగాణ
Bandi Sanjay: సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆదరణ వస్తోంది

Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, సొంత అభిప్రాయాలను నాయకత్వంపై రుద్దబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం, కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ఫ్రోగ్రామ్స్‌లో పాల్గొన్న బండి దేశంలో మోడీ సర్కార్ అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తీసుకుందని సంజయ్ అన్నారు.
ఎరువుల సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటి అంశాలతో అన్నదాతకు మోడీ అండగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి కొనియాడారు. సైకిళ్ల పంపిణీకి దేశవ్యాప్తంగా పేరొస్తోందని, ఎంపీలందరూ ఈ కార్యక్రమం గురించి వాకబు చేస్తున్నారని బండి సంతోషం వ్యక్తం చేశారు. టెన్త్ పాసైన అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని బండి మాటిచ్చారు.