News
Srisailam: శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటి నిల్వలు

Srisailam: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి. ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358 టీఎంసీలు, ఏపీ 199 టీఎంసీలను దిగువ నాగార్జునసాగర్‌కు వదిలేశాయి.
రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి పేరిట పోటీ పడి దిగువకు నీటి విడుదల చేస్తుండటంపై.. పర్యావరణవేత్తలు, సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.