తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని బండి సంజయ్ హెచ్చరించారు.
రెండేళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పంచాయితీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.



