తెలంగాణ
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు. గత పదొకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు.
కేంద్ర పథకాలను ఆపేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్రం ఆలోచిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.