తెలంగాణ
Bandi Sanjay: త్వరలో మోదీ కిట్‌లు అందిస్తాం

Bandi Sanjay: కేంద్రప్రభుత్వం విద్య కోసం 1. 28 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ పెట్టినరోజు సందర్భంగా మన మోదీ కానుక పేరుతో కరీంనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలచుకుంటే అద్భుతాలు చేయగలరన్నారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్‌లో తలెత్తుకుని జీవిస్తామన్నారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తైన తర్వాత త్వరలోనే మోదీ కిట్‌లు పంపిణీ చేస్తామని బండి సంజయ్ తెలిపారు.