తెలంగాణ
Bandi Sanjay: బండి సంజయ్ మీటింగ్‌కు అనుమతి రద్దు

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిధిలోని బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో బండి సంజయ్ మీటింగ్ ఖరారైంది. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటనిబీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీజేపీ నేతలు కోరారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు.



