తెలంగాణ
Bandi Sanjay: ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ?.. 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప

Bandi Sanjay: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ’12 నెలల నరకం’ అంటూ జనవరి నుంచి డిసెంబర్ వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వివిధ మీడియాల కథనాల క్లిప్‌లను దానికి జత చేశారు.
*రైతుల రోదనలు
*ఆటోవాలాల ఆత్మహత్యలు
*ఆడబిడ్డల ఆక్రందనలు
*నిరుద్యోగుల నిరాశ, నిస్పృహలు
*పసి పిల్లల అన్నంలో పురుగులు
*హైడ్రాతో అరాచకాలు
*మూసీతో మూటలు నింపే ప్రణాళికలు
*కాంట్రాక్టర్ల దోపిడీ కథలు
*నీటిమూటలైన మాటలు