అంతర్జాతీయం

Pakistan: పాక్‌లో రైలు హైజాక్‌.. బందీలుగా 140మంది ప్రయాణికులు

Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదలు ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేశారు. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును కాల్పులు జరిపి హైజాక్ చేశారు. క్వెట్టా నుంచి పెషావర్‌ వస్తున్న జఫ్ఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ హైజాక్‌ చేసింది. ఈ హైజాక్‌లో 140 మంది పాక్‌ సైనికులను బందీలుగా పట్టుకున్నారు.

అయితే రైలులో ఉన్న పిల్లలను, మహిళలను మాత్రం విడిచపెట్టారు. రైల్వే ట్రాక్‌ను పేల్చి వేసిన తరువాత ఈ హైజాకింగ్‌కు పాల్పడ్డారు. బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రవాదుల కాల్పుల్లో రైలు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెంటనే ఆపరేషన్‌ చేపట్టింది. వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button