సినిమా
గాంధీపై అనుచిత వ్యాఖ్యలు..నటుడు శ్రీకాంత్ పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు

Balmuri Venkat: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణును కలుస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు.



