తెలంగాణ
Telangana: డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..

Telangana: నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీకి చెందిన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం సృష్టించింది. కత్తెర గుర్తుకు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో దర్శనమివ్వడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై భారత రాష్ట్ర సమితి నేతలు ఎన్నికల అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసీ ఎన్నికల సామగ్రి భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సూచించారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి స్టేజ్-2 ఆర్వోపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.



