ఆంధ్ర ప్రదేశ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీమంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా నుంచి పవన్ పర్యటనను ప్రారంభించాలని బాలినేని కోరారు. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, అభివృద్ధిపైనా దృష్టిపెట్టాలని బాలినేనికి పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం.



