Daaku Maharaaj: ఇంకా ఆగని బాలయ్య ‘డాకు మహారాజ్’ రికార్డులు!

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం టీవీ ప్రీమియర్‌లో సంచలనం సృష్టించింది. బిగ్ స్క్రీన్‌పై హిట్ అయిన ఈ చిత్రం, స్మాల్ స్క్రీన్‌పై కూడా అద్భుత స్పందన అందుకుంది. రేటింగ్‌లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో తెలుసుకుందాం.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ సినిమా, ఇటీవల జరిగిన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో 8.23 రేటింగ్‌తో దూసుకెళ్లింది. ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే ఈ రేటింగ్ అద్భుతమని చెప్పవచ్చు.
బాబీ డియోల్ విలన్‌గా మెప్పించగా, థమన్ సంగీతం సినిమాకు బలం అద్దింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, టీవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.



