సినిమా

Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్' స‌క్సెస్ పార్టీలో ఊర్వశి రౌతేలాతో బాలయ్య‌ స్టెప్పులు

Daaku Maharaaj: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ సినిమా సంక్రాంతి కానుక‌గా ఆదివారం నాడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో చిత్ర బృందం గత రాత్రి స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించింది. హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ పార్టీకి బాల‌య్య‌తో పాటు ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వ‌శి రౌతేలా, ప‌లువురు హీరోలు హాజ‌రై సంద‌డి చేశారు.

ఈ స‌క్సెస్ పార్టీలో బాల‌కృష్ణ‌తో పాటు యంగ్ హీరోలు విష్వక్సేన్, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ హంగామా చేశారు. సిద్ధూ, విష్వక్సేన్ చెంప‌లపై బాల‌య్య ముద్దులు పెట్టారు. ఇక ఊర్వ‌శి రౌతేలాతో బాల‌య్య మ‌ళ్లీ స్టెప్పులేశారు. ‘ద‌బిడి దిబిడి’ పాట‌కు ఊర్వ‌శితో డ్యాన్స్ చేస్తూ హూషారెత్తించారు. ఈ వీడియోను ఊర్వ‌శి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/reel/DEwOoaOPwf7/?utm_source=ig_embed&ig_rid=dcba8eac-e81e-4fb7-b36a-bc671afbf4ed

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button