Balakrishna: బాలయ్య సీరియస్ వార్నింగ్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన బసవతారకం కాన్సర్ హాస్పిటల్ పేరుతో జరుగుతున్న ఓ ఫేక్ ఈవెంట్‌పై సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. అసలు విషయం ఏంటంటే…
నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రీకరణలో ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఈ క్రమంలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన స్పందించారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరుతో అనుమతి లేకుండా విరాళాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై బాలయ్య స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. ఈ ఈవెంట్‌కు తన ఆమోదం లేదని, హాస్పిటల్ ట్రస్ట్ నుంచి అధికారిక అనుమతి లేనట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు ఇటువంటి అనధికారిక కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బసవతారకం హాస్పిటల్ తరఫున అన్ని కార్యక్రమాలు, విరాళాల సేకరణ పారదర్శకంగా, ధృవీకరించబడిన మాధ్యమాల ద్వారానే జరుగుతాయని ఆయన తెలిపారు. మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.