సినిమా
Balakrishna: భగవంత్ కేసరికి అవార్డు రావడం సంతోషం

Balakrishna: మహిళా సాధికారత కోసం తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని సినీనటుడు నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని బాలయ్య బాబు స్పష్టం చేశారు.
అమరావతిలో ఈనెల 13వ తేదీన బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ పరిశీలించారు.