తెలంగాణ
బాల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ

వరంగల్ జిల్లా కేంద్రంలోని బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంత్రి కొండా సురేఖ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు స్వామివారి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.



