ఆంధ్ర ప్రదేశ్

Balayya vs Chiru: బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి..పవన్ కళ్యాణ్ ఎటువైపు..

Balayya vs Chiru: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న కోల్డ్ వార్ అసెంబ్లీ వేదికగా మరోసారి బయటపడింది. మాజీ సీఎం జగన్ ను చిరంజీవి కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలయ్య మెగాస్టార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కామెంట్ చేయడంతో ఈ వ్యవహారం ముదిరి పాకన పడింది. పరిస్ధితి తనకు ఇబ్బందికరంగా మారిందని గ్రహించిన చిరంజీవి వెంటనే కౌంటర్ ఇవ్వడంతో సై అంటే సై అన్నట్లు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తార స్ధాయి చేరింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే చిరంజీవి ఇచ్చిన కౌంటర్ బాలయ్యకే కాకుండా పవన్ కళ్యాణ్ కు కూడా వర్తిస్తుందని దీంతో ఏపీ రాజకీయాలు సీనిమాటిక్ ట్విస్ట్ తీసుకున్నాయని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడూ అభిమానులపై చేయిచేసుకునే నందమూరి బాలకృష్ణ ఈసారి నోటికి పని చెప్పారు. అసెంబ్లీ వేదికగా మెగాస్టార్ చిరంజీవిపై రెచ్చిపోయారు. వైసీపీ అధినేత జగన్ ను సైకో గాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు. జగన్ ను ఇంటికెళ్లి కలిసిన చిరంజీవి వైఖరిని తప్పుబట్టే రీతిలో బాలయ్య చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది.

ఈ కామెంట్స్ ద్వారా చిరంజీవిపై ఎంతకాలంగా తన అక్కసును బాలయ్య వెళ్లగక్కారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఇదే విధంగా మెగాస్ట్ర్ పై బాలకృష్ణ ఆవేశంతో విరుచుకుపడ్డారు. దీనికి చిరంజీవి కౌంటర్ ఇస్తూ బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వమంటూ బాలయ్య వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలకృష్ణ మళ్లీ తన పేరును ప్రస్తావించి అనవసరమైన రాద్ధాంతం చేయడంపై చిరు ఘాటుగా స్పందించారు.

నాకు ఇష్టమైతే విలన్ ను పొగుడుతా హీరోను విలన్ గా చిత్రీకరించి, విమర్శలు చేస్తా..అంతా నా ఇష్టం..నన్ను అడిగే దమ్ము ఎవరికి ఉందంటూ ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలను నిజం చేసే విధంగా తాజాగా చిరంజీవిని కించపరుస్తూ..బాలకృష్ణ నోటికొచ్చిన కామెంట్లతో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన ప్రసంగంతో మొదలైన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారింది.

టాలీవుడ్ హీరోలను ఇంటికి పిలిచి అవమానించడంపై చిరంజీవి నిలదీశారని కామినేని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ బాలకృష్ణ ప్రసంగం మొదలుపెట్టారు. కామినేని చెప్పిన విధంగా జగన్ ను చిరంజీవి నిలదీయలేదని, అంతా మౌనం పాటించారంటూ మెగాస్టార్ పై తనకున్న అసంతృప్తిని బాలయ్య బయటపెట్టేశారు.

దీంతో నందమూరి వర్సెస్ కొణిదెల మధ్య కొంతకాలం పాటూ సర్దుమణిగిందనుకున్న వార్ మళ్లీ మొదలవుతుందని మెగా అభిమానులంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాదాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా బాలయ్య కామెంట్స్ పై మాత్రం ధఈటుగా స్పందించారు. బలకృష్ణ చెబుతున్న ప్రకారం తనను జగన్ అవమానించలేదని, సాదరంగా ఆహ్వానించి గౌరవించారని చిరంజీవి స్పష్టం చేయడం కొసమెరుపు. దీంతో బలయ్యతో పాటూ గతంలో టాలీవుడ్ ప్రముఖులను జగన్ అవమాన పరచారని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చిరు ప్రకటన ద్వారా తేలిపోయిందని వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.

జనసేనకు చెందిన సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్లో తన పేరును తొమ్మిదో ప్లేసులో ప్రచురించడంతో ఈ నందమూరి హీరోకు ఎక్కడో కాలినట్లుంది. దీంతో ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని బాలయ్య అందర్నీ ఓ రౌండ్ వేసేశారు. ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్లు కందుల మంత్రి దుర్గేష్ ను నిలదీయాల్సింది పోయి ఈ వివాదంలోకి అనవసరంగా చిరంజీవిని లాగారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. అన్నీ సవ్యంగా చేస్తే ఆయన బాలయ్య ఎందుకవుతారంటూ చిరు ఫ్యాన్స్ సెటైర్లు పేలుస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button