ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట, మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు. తనపై నమోదైన అన్నీ కేసుల్లోనూ బెయిల్ మంజూరు లభించ డంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ కూటమి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది. దీంతో ఇవాళ వంశీ భవిత్యవం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీ అరెస్ట్ అయ్యారు.