2027లో జక్కన్న కొత్త సినిమా?

Baahubali The Eternal War: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్‌తో ప్రపంచ గుర్తింపు సాధించాడు. ఇప్పుడు కొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ 2027లో రానుంది. దీనికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి సమర్పిస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్‌తో భారత సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చాడు. ఇప్పుడు ఆ సిరీస్ పేరుతో కొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ 2027లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. రాజమౌళి సమర్పకుడిగా ఉంటారు. దేవ-రాక్షస యుద్ధంలో బాహుబలి పాత్రతో మహావతార్ నరసింహ లాంటి భారీ యానిమేషన్ కథనం ఇది. రాజమౌళి ప్రకటనతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
బాహుబలి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ కొత్త చిత్రం కూడా అదే ఆకర్షణ సృష్టిస్తుందట. ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో జక్కన్న సూపర్ స్టార్ మహేష్‌ను ఎలా చూపిస్తారో, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.



