ఆంధ్ర ప్రదేశ్
బొబ్బిలి కోటలో దసరా ఆయుధ పూజ

విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా వంశీయులు దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు ఆయన సోదరుడు రామకృష్ణ రంగారావు, మరో సోదరుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోటలోని దర్బార్ మహాల్లో వేద పండుగల ఆశీర్వచనాల మధ్య ఆయుధపూజ చేశారు.
అలనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు, తుపాకులు, బాకులు, బల్లాలకు పూజలు నిర్వహించారు. బొబ్బిలి రాజుల పూర్వీకులు వాడిన బంగారు వెండి సింహాసనాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బిలి పట్టణ పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ఆయుధ పూజను తిలకించేందుకు వచ్చిన వారికి కోటలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.



