ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్

Avinash Reddy: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి కడపలో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనేకమైన పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రజాపయోగమైన పధకాలను నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా పక్కన బెట్టేశారని వివరించారు. విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విద్యాదీవెన వసతిదీవెన వంటి పథకాలు సైతం ఎత్తేశారని తెలిపారు.



