ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారానికి తెర లేపింది

Avinash Reddy: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారానికి తెర లేపిందని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల పులివెందులలో వైసీపీ నేతలు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల వ్యవహారంపై కడప ఎస్పీ ని కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అక్రమ మద్యం వెల్లువెత్తుతోందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్ బ్రాండ్ అంటే నారా వారి సారా ఏరులై పారుతోందని విమర్శించారు. ఇప్పటివరకూ 5280 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. అలాగే 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు అమ్ముడయ్యాయని గుర్తుచేశారు. ఈ ఏడాది కాలంలోనే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు.



