జాతియం
Rammohan Naidu: విదేశీ మీడియా విమాన ప్రమాదంపై తప్పుడు ప్రచారం

Rammohan Naidu: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతోందని, పూర్తి నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తామని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. విమాన ప్రయాణీకులకు రక్షణ లేకుండా పోయిందని, పౌర విమానయానశాఖ తగు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతుందని విపక్షాలు ఆరోపించాయి.
అయితే దేశంలో విమాన ప్రయాణాల సంఖ్య పెరుగుతుందని, ఎయిర్ పోర్టులు పెరుగుతున్నాయని, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలను భూతద్దంలో చూడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చింతిస్తున్నామని, కాక్‌పిట్ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని మంత్రి సభకు తెలిపారు. విదేశీ మీడియా విమాన ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి రామ్మోహన్ అన్నారు.