తెలంగాణ
Sridhar Babu: ఆస్ట్రేలియాతో భారత సంబంధాలు మరింత పటిష్టం కావాలి

Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియల్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో ఆస్ట్రేలియా బృందం భేటీ అయ్యింది. ఫ్యూచర్ సిటిలో డీకిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టేందుకు ఆస్ట్రేలియా బృందంతో ఒప్పందం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో భారత సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆశిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
ఇండియా విద్యార్ధులు ఆస్ట్రేలియాలో వేల మంది చదువుతున్నారని అన్నారు. ఆస్ట్రేలియా విద్యా రంగంతో కలిసి అనేక సంస్కరణలు చేయొచన్నారు . ఇండియా అత్యంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆస్ట్రేలియా మంత్రి జూలీన్ హిల్ అన్నారు.



