పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి, అయ్యప్పల ధర్నా

కేరళలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం. ఆయన దర్శనం కోసం భక్తులు క్యూ కడతారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలే కాదు.. వివిద రాష్ట్రాలకు చెందిన వారు కూడా అక్కడి వస్తుంటారు. మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో శబరిమల ఎక్కువగా వార్తల్లోకి వస్తోంది. అక్కడికి వెళ్లిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. తెలుగు వ్యక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇంతకీ అసలు అక్కడేం జరిగింది..? ఎందుకు తెలుగు భక్తులపై ఇంతలా దాడులు జరుగుతున్నాయి..? అసలు పళని సుబ్రమణ్య స్వామి సన్నిదిలో ఏం జరుగుతోంది..?
కేరళలోని ప్రసిద్ద ఆలయం శబరిమలకు భక్తులు పొటెత్తారు. మనదేశం నుంచి మాత్రమే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శబరిమాల భక్తులతో కిట కిటలాడుతుంది. ఇటీవల శబరిమలలో కొంత మంది అధికారులు, స్థానికుల ప్రవర్తన తరచుగా తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా కొంత మంది శబరిమలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి చేశాడు అక్కడి స్థానిక వ్యాపారి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంది.
ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. ఎంఆర్‌పీ ధర 30గా ఉండగా దుకాణుదారుడు 40 డిమాండ్ చేశాడు. అదేంటని భక్తుడు నిలదీయగా.. తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి, బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షామాలను తెంచేశాడు.
ఈ సమాచారం అందుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణుదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి, వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే ఆందోళన నిర్వహించారు. స్థానిక మిగతా షాపుల ఓనర్లు భక్తులపై ఎదురు తిరిగారు.
తమ ఆందోళనపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ.. తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ఏపీ-తెలంగాణకు చెందిన తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భక్తులను, వ్యాపారులను అక్కడిని పంపే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో స్థానిక వ్యాపారస్తులకు పోలీసులు మద్దుతుగా ఉండటాన్ని మండిపడుతున్నారు. గతంలోనూ అలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక భక్తుడు దర్శనం విషయంలో ఆరాతీయగా చాలా నీచంగా అక్కడి అధికారి మాట్లాడాడు. ఈ ఘటనపై పెద్ద దుమారం చెలరేగింది. కనీసం అయ్యప్ప సన్నిధానంలో ఉన్నాం. అయ్యప్ప మాల వేసుకున్న వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని కూడా వారు ఆలోచించడంలేదు. మొత్తంగా కేరళ అధికారులు, స్థానిక వ్యాపారుల పట్ల తరచుగా కాంట్రవర్సీ అంశాలు వార్తలలో ఉంటున్నాయి.
ప్రతీ ఏడాది ఈ సీజన్‌లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అధికంగా ఉంటారు. ఈక్రమంలోనే శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. శబరిమలలో రద్దీ అనుగుణంగా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేయలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి కనీస సౌకర్యాలు సరిగా లేవని, స్థానికులు మర్యాదగా ప్రవర్తించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటీవల పోలీసు అధికారి తెలుగు భక్తులు అసభ్యకరంగా మాట్లాడారు. తాజాగా ఇప్పుడు స్థానిక వ్యాపారులు దాడి వంతైంది.అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ తెలుగు భక్తులకు పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
నిజానికి అయ్యప్ప మాల వేసుకునేవారిలో తెలుగువారే ఎక్కువ. గతంతో పోల్చితే ఈ ఏడాది మాలదారుల సంఖ్య రెట్టింపయ్యింది. శబరిమలకు వచ్చే భక్తులతో పాటు ఆదాయం కూడా తెలుగు రాష్ర్టాల నుంచే ఎక్కువ. ఈసారి మాలలు వేసిన వారిలో ప్రతి పదిమందిలో ఆరుగురు కన్నెస్వాములు ఉన్నారంటే మాలధారుల సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతే మాల సమయంలో నిష్టగా ఉండటంతో తెలుగువారి తరువాతే ఎవరైనా అనేది సుస్పష్టం.
అలాంటిది తెలుగు భక్తులకు శబరిలో వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. అనేక వ్యయా ప్రయాసాలకు ఓర్చి శబరి దర్శనానికి వెళ్తున్న తెలుగువారికి స్థానికులు, పోలీసులు, ఇతర సిబ్బంది నుంచి తీవ్ర అవమానాలు తప్పడం లేదు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు వాపోయారు.
కాగా.. ఈ విషయమై తెలుగు అయ్యప్ప భక్త సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం మూలగానే ఇలా జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాగే జరిగితే శబరికి వచ్చే తెలుగువారి సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల శబరిని పోలిన, అంతే స్థాయిలో అయ్యప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయి. భవిష్యత్తులో తెలుగువారికి అవమానం జరిగితే ఇదే దేవాలయాలకు భక్తులు క్యూ కడుతారని అంటున్నారు.
అయితే లాస్ట్ టైమ్ భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు భరోసా ఇచ్చాయి. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. హిందూ మతంపై విశ్వాసం లేని ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. రంగనాథ స్వామి ఆలయ పవిత్రతను పాడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శబరిమల అయ్యప్ప గుడి ఒక ప్రత్యేకమైన ఆలయం. ఇది ఏడాది పొడవునా తెరిచి ఉండదు. ముఖ్యంగా మండల పూజ, మకరవిళక్కు, మహా తిరుమల్ సంక్రాంతి, ప్రతి మలయాళ నెలలోని మొదటి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకోగలరు. కాగా స్వామి ఆలయం మండల-మకర విళక్కు పూజల కోసం నవంబర్ 16న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకుంది. ప్రధాన పూజారి కందరార్ మహేశ్ మోహనార్ సమక్షంలో మేల్‌సంతి అరుణ్ కుమార్ నంబూద్రీ ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరిచారు.
సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి 18 మెట్లు మీదుగా దిగి, సన్నిధానం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో పవిత్ర గుండం వెలిగించారు. వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు, కొత్తగా నియమితులైన పూజారులు తలుపులు తెరవడంతో యాత్రా సీజన్ మొదలైంది. అప్పటి నుంచి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు. నవంబరు 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి మకరు విళక్కు పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మరి చూడాలి ఇకనైనా ఇలాంటి సంఘటనలపై అధికారులు స్పందించి అయ్యప్ప భక్తులకు రక్షణ కల్పిస్తారో లేక ఇలానే వదిలేస్తారో.



