ఆంధ్ర ప్రదేశ్
Atchannaidu: పత్తి రైతులకు అండగా ప్రభుత్వం

పల్నాడు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను ప్రత్యేక్షంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హమీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని స్పష్టం చేశారు.



