Australia: బాండి బీచ్‌లో కాల్పులు.. 10 మంది మృతి

Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో వందల మంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్గన్లతో సర్ఫ్ క్లబ్ సమీపంలోని పాదచారుల వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఓ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లు, దాదాపు 30 అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.



