తెలంగాణ

హైదరాబాద్‌‌ వాసులకు గుడ్ న్యూస్… అశోక్ నగర్ లింక్ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్ నగరవాసులకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. అశోక్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాపై నూతనంగా నిర్మించిన.. చిక్కడపల్లి – దోమలగూడ లింక్ బ్రిడ్జిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 6 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ వంతెన అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజ్ మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని అందిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button