తెలంగాణ
బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

బాలాపూర్ వినాయకున్ని ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ , హైదరాబాద్ కలెక్టర్ హరిచందన , హైడ్రా కమిషనర్ రంగనాథ్ , చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డితోపాటు నిర్వాహకులు వారిని సత్కరించి ప్రసాదాన్ని అందచేశారు.బాలాపూర్ గణేష్ పూజ పూర్తయిన తర్వాత, హైదరాబాద్ కలెక్టర్ , సీపీ సి.వి. ఆనంద్, ఇతర సీనియర్ అధికారులు చార్మినార్ దగ్గర బాలాపూర్ గణేష్ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.



