ఆంధ్ర ప్రదేశ్
ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత వచ్చింది. చిరత సంచారంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విద్యార్ధులు రాత్రి పూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.



