ఆంధ్ర ప్రదేశ్

AP News: సినిమాను తలపించే సీన్.. టోల్ గేట్‌ను గుద్దుకుని వెళ్లిన గంజాయి వాహనం..

AP News: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సినిమా సీన్ తలపించింది. టోల్ గేట్‌ను గుద్దుకుని వెళ్లింది గంజాయి వాహనం. నందిగామ వై జంక్షన్‌లో లారీ అడ్డుపెట్టి గంజాయి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసులను తప్పించుకునేందుకు శివారులో గంజాయి స్మగ్లర్లు కారు వదిలి వెళ్లారు.

డ్రోన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. 120 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకేరోజు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రెండు కార్లలో 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో కీసీర వద్ద ఒక కారు, చిల్లకల్లు టోల్ గేట్ వద్ద మరో కారులో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button