ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Chandrababu: ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి మాకు మద్దతు ఇచ్చారని అన్నారు. కొందరు అభివృద్ధి చేస్తే మరికొంత మంది నాశనం చేస్తారని విమర్శించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందాలన్నారు.
సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు.సంక్షేమ అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తామన్నారు. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్.