తెలంగాణ
Ponnam: రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో లేవని కిషన్ రెడ్డి రాసివ్వగలరా..?

Ponnam: బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 10శాతం ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీజేపీ బిల్లును అడ్డుకుంటుందని మండిపడ్డారు. బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చిన బీజేపీ ఢిల్లీలో యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో లేవని కిషన్ రెడ్డి రాసివ్వగలరా..? అని ప్రశ్నించారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు.



