ఆంధ్ర ప్రదేశ్
AP Liqour Case: ఏపీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో 11 మంది నిందితులకు ఆగస్టు ఒకటో తేదీ వరకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. 330 పేజీల ఛార్జ్‌షీట్‌పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నాగేశ్వర్ రెడ్డి మూడు గంటల పాటు వాదనలు వినిపించారు. మరోవైపు ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా ఆధారాలు సేకరించామని, చట్టపరంగానే అరెస్టులు చేశామని, న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసు దర్యాప్తులో మరి కొంతమందిని విచారించాల్సిన అవసరం ఉన్నందున ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలు చేసినట్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు.