అఖండ-2కు ఏపీలో టికెట్ ధరల పెంపు!

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 తాండవం సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతించింది. ప్రీమియర్ షోకు గరిష్ఠంగా 600 రూపాయలు, మొదటి పది రోజులు మల్టీప్లెక్స్‌ల్లో 100, సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు పెంచారు.
బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి కలిసి తెరకెక్కించిన అఖండ-2 తాండవం ఈ నెల 4వ తేదీ ప్రీమియర్‌తో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. డిసెంబరు 4న ప్రీమియర్ షోకు గరిష్ఠంగా 600 రూపాయలు, 5వ తేదీ నుంచి మొదటి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌ల్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు అదనంగా వసూలు చేయవచ్చని అనుమతించింది.
ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజవుతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అదిరిపోయాయని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. థమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణంలో తేజస్విని నందమూరి సమర్పిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సాధిస్తుందన్న ఆశలు అభిమానుల్లో నిండాయి.



