ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా

AP Constable results postponed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు.

తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నిర్ణయించిందని, ఎలాంటి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు అధికార వర్గాలు అధికారవర్గాలు తెలిపాయి. ఈ రోజు ఫలితాలను పరిశీలించి బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5లక్షల 9వేల 579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5 లక్షల 3 వేల 487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4లక్షల58వేల 219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40శాతం , బీసీలకు 35శాతం ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button