ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.